Sep 15,2021 21:55

దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
ప్రజాశక్తి- బైరెడ్డిపల్లి

స్థానిక మండల కేంద్రంలో లీగల్‌ ఇన్స్పెక్టర్‌ దివ్య సిబ్బంది కలిసి బుధవారం పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వరహించారు. అధిక ధరలకు సరుకులు విక్రయిస్తున్నారని అందించిన సమాచారం మేరకు బైరెడ్డిపల్లి నాలుగు రోడ్లుల్లోని మూడు దుకాణాల్లో తనిఖీ చేసినట్లు తెలిపారు. ఎవరైనా ఎంఆర్‌పి రేట్ల కంటే ఎక్కువగా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే దుకాణదారులు అక్రమాలకు పాల్పడితే 9398158259 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.