Oct 17,2020 20:31

షార్జా : చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేయర్‌ డుప్లెసిస్‌ అర్ధసెంచరీ నమోదు చేసుకున్నాడు. పరుగులేమీ చేయకుండానే తుషార్‌ దేశ్‌పాండే వేసిన తొలి ఓవర్‌లో మూడో బంతికి ఓపెనర్‌ శామ్‌ కరన్‌ (0) ఎన్రిచ్‌ నోర్జే చేతికి చిక్కి పెవిలియన్‌ చేరడంతో కష్టాల్లో పడ్డ చెన్నైని ఆచితూచీ ఆడుతూ డుప్లెసిస్‌ పరుగులు రాబట్టాడు. 39 బంతులాడి 50 పరుగులు చేశాడు. అందులో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. 12 ఓవర్లు ముగిసే సరికి చెన్నై 87 పరుగులు చేసింది.