May 29,2023 21:26

పెట్రోల్‌ బంక్‌ వద్ద నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు

రాయచోటి టౌన్‌ : పట్టణంలో బషీర్‌ఖాన్‌ పెట్రోల్‌ బంకులో శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు ముగ్గురు కార్మికులు చనిపోయిన దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, మతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. సోమవారం ప్రమాదానికి కారణమైన బషీర్‌ఖాన్‌ పెట్రోలు బంక్‌ వద్ద ధర్నా నిర్వహించారు. అంతకుముందు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందుస్థాన్‌ పెట్రోలియం లిమిటెడ్‌ కంపెనీ యాజమాన్యం, పెట్రోల్‌ బంకు నడుపుతున్న బషీర్‌ఖాన్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన బషీర్‌ఖాన్‌ పెట్రోలు పంపు యాజమాన్యాన్ని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. పెట్రోలు పంపులో ట్యాంక్‌ అండర్‌ గ్రౌండ్‌లో ఉందని దాన్ని క్లీన్‌ చేయాలని ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు పాటించకుండా, అగ్నిమాపక శాఖ, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌ శాఖ అధికారుల అనుమతి లేకుండా యాజమాన్యాల నిర్లక్ష్య ఫలితంగా ముగ్గురు కార్మికులు మ తి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంత దుర్ఘటన అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో జరిగితే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రమాదానికి కారణమైన వారిని తక్షణమే అరెస్టు చేసి, వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ దుర్ఘటనపై ఉన్నత స్థాయి అధికారులతో సమగ్రంగా విచారణ జరపాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాయచోటిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కేసును నీరుగార్చే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. కార్మికుల కుటుంబాలకు అన్యాయం చేస్తే సహించేది లేదని సిపిఎం ఆధ్వర్యంలో అన్ని రంగాల, సంఘాల ప్రాణాలను సమీకరించి ఉద్యమం ఉధ తం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రామాంజులు, నాయకులు బసిరెడ్డి, రామచంద్ర, రెడ్డయ్య, సురేంద్రబాబు, వెంకటరమణ పాల్గొన్నారు.