Feb 01,2023 20:42

ప్రజాశక్తి - పెనుమంట్ర
డ్వాక్రా మహిళల పురోభివృద్ధికి తక్కువ ఖర్చుతో కూడిన భువనగిరి చెందిన కడక్‌ నాథ్‌ కోళ్లను పంపిణీ చేస్తున్నట్లు ఇన్‌ఛార్జి ఐకెపి ఎపిఎం ఎం.రామకృష్ణ అన్నారు. బుధవారం కార్యాలయం వద్ద సీసీ ఆధ్వర్యంలో వంద యూనిట్లు డ్వాక్రా మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ క్లస్టర్ల వారీగా పెనుమంట్రకు 34, మార్టేరుకు 33, మాముడూరుకు 33 యూనిట్లు అందజేశారు. ఒక్కో యూనిట్‌కు 15 కోళ్ల ధర రూ.3,990 చొప్పున అందజేస్తున్నట్లు తెలిపారు. మొత్తం మండలంలోని 1360 గ్రూపులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీలు టి.విజయకుమారి, కె.సుధ, వి.సత్యవతి, సిఎలు, డ్వాక్రా మహిళలు ఉన్నారు.