Jan 30,2023 21:11

ప్రజాశక్తి - భీమవరం
భీమవరం కలెక్టరేట్‌లో ఆధునికీకరించిన డ్వామా కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి సోమవారం ప్రారంభించారు. కలెక్టరేట్‌ మొదటి అంతస్తులో ఆధునికీకరించిన డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ ఛాంబర్‌ను డిఆర్‌ఒ దాసిరాజుతో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. జిల్లా విభజన అనంతరం కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డ్వామా కార్యాలయానికి గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో కొన్ని మరమ్మతులు, ఛాంబర్ల ఏర్పాటు పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ పనులు పూర్తి కావడంతో కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ ఎస్‌టివి.రాజేశ్వరరావు, జూనియర్‌ ఇంజినీర్లు శ్రీనివాస్‌, ఆనంద్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు ప్రవీణ్‌, ఒమేగా రావు పాల్గొన్నారు.