May 31,2023 21:57

ఫొటో : మాట్లాడుతున్న కావలి డిపో మేనేజర్‌ రాపూరు శ్రీనివాసులు

'డయల్‌ యువర్‌ డిఎం'
ప్రజాశక్తి-కావలి : జూన్‌ 1వ తేదీ నుంచి గురువారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు డయల్‌ యువర్‌ డిఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎపిఎస్‌ ఆర్‌టిసి కావలి డిపో మేనేజర్‌ రాపూరు శ్రీనివాసులు తెలిపారు. కావున ప్రజలు, ప్రయాణికులు 9959225643 నెంబర్‌కు ఫోన్‌ చేయడం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అమూల్యమైన సూచనలు, సలహాలు ఇచ్చి, ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి సహకరించాలని కోరారు.
కావలి డిపో పరిధిలోని ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను తెలపాలని, ఆర్‌టిసి కల్పిస్తున్న సౌకర్యాలను, పధకాలను, రాయితీల గురించి తెలుసుకుని కావలి డిపో అభివృద్ధికి దోహద పడాలన్నారు.