Jun 25,2022 19:47

గౌహతి : అస్సాంలో వరద ముంపు ఇప్పట్లో తొలగేలా కనిపించడం లేదు. వరుసగా ఆరో రోజైన శనివారం కూడా కచార్‌ జిల్లాలోని సిల్చార్‌ ప్రజానీకం నీటిలోనే మగ్గిపోతున్నారు. వరదలు, కొడచరియలు విరిగిపడిన కారణాలతో మరో 10 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. బర్పేటా, ధుబ్రి, కరింగంజ్‌, ఉడల్గురి జిల్లాల్లో ఇద్దరు చొప్పున చనిపోగా, కచార్‌, మోరిగావ్‌లో ఒక్కొక్కరు మరణించారు. దీంతో ఈ వరదల కారణంగా ఇప్పటి వరకు చనిపోయినవారి సంఖ్య 118కు పెరిగిందని అధికారులు శనివారం తెలిపారు. వరద ఉధృతి 28 జిల్లాలకు తగ్గిందని, ప్రభావిత ప్రజల సంఖ్య కూడా 33.03 లక్షలకు తగ్గిందని అస్సాం రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ (ఎఎస్‌డిఎంఎ) అధికారులు చెప్పారు. వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్రంలోని బిజెపి, కేంద్రంలోని మోడీ సర్కార్‌ వైఫల్యాలపై విమర్శలు వెల్లువెత్తడంతో సహాయక చర్యల్లో శనివారం కాస్త వేగం పెంచారు. వాయుసేన హెలికాప్టర్ల ద్వారా ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఆహార ప్యాకెట్లు, వాటర్‌ బాటిళ్లు చేరవేశారు. డ్రోన్ల ద్వారా సిల్చార్‌లో వరద పరిస్థితిని అంచనా వేస్తునాురు. 207 మందితో కూడిన 8 ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు, 120 మందితో కూడిన ఒక సైనిక పటాలం సిల్చార్‌లో సహాయక కార్యాక్రమాలు కొనసాగిస్తున్నాయి. ఒక్క సిల్చార్‌లోనే ఇంకా సుమారు 3 లక్షల మంది ముంపు నీటిలో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తాగునీటికి, మందులకు తీవ్రమైన కొరత నెలకొందని అధికారులు తెలిపారు.

తక్షణమే ఆదుకోండి : సిపిఎం
అస్సాంలో వరదల కారణంగా బ్రహ్మాపుత్ర, బరాక్‌ నదీ తీర ప్రాంతాల్లో భారీగా ప్రాణ, ఆస్థి నష్టం చోటుచేసుకోవడం పట్ల సిపిఎం పొలిట్‌బ్యూరో తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి తక్షణమే అక్కడి ప్రజానీకానిు ఆదుకోవాలనిడిమాండ్‌ చేసింది. ఈ మేరకుశనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని32 జిల్లాల్లో 60 లక్షల మంది పైగా ప్రజలు జీవన్మరణ పోరాటం చేస్తునాురనిపేర్కొంది. ఈ విలయానికి గురై వంద మంది పైగా మరణించడం దురదృష్టకరమనితెలిపింది. ఇప్పటి వరకు1.08 లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగిపోయాయని, 2000 కిలోమీటర్ల పైగా రహదారులు ధ్వంసమయ్యాయనిపేర్కొంది. వేలాది మూగ జీవాలు కూడా ఈ వరదల కారణంగా చనిపోయాననిసిపిఎం తెలిపింది. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉను బిజెపి ప్రభుత్వాలు వరద బాధితులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమయ్యానివిమర్శించింది. ఈ రెండు ప్రభుత్వాలూ మహారాష్ట్ర ప్రభుత్వానిు అస్థిర పర్చేందుకుఅక్కడి ఎమ్మెల్యేలకుగౌహతిలో ఆశ్రయం కల్పించి బేరసారాలు సాగించడంలో నిమగుమయ్యాయే తప్ప వరద బాధితులను పట్టించుకోవడం లేదనిఆగ్రహం వ్యక్తం చేసింది. సహాయక చర్యలపై దృష్టి సారించకపోవడంతో ఆహారం, మంచి నీళ్లు, మందులు సరఫరా అందక ప్రజలు అవస్థ పడుతునాురనితెలిపింది. ఇంత విలయంలో ప్రజలు విలవిల్లాడుతుంటే అస్సాం వరద పరిస్థితినిపరిశీలించేందుకుప్రధానమంత్రి కానీ, కనీసం ఒక్క కేంద్ర మంత్రి కానీ రాకపోవడానిు తప్పుబట్టింది. తక్షణమే వరద బాధితులను ఆదుకునేందుకుసహాయక చర్యలను ముమ్మరం చేయాలనిసిపిఎం కోరింది. ఆహారం, తాగునీరు, మందులు పంపిణీ చేయాలనిడిమాండ్‌ చేసింది. అలాగే అస్సాం వరద సహాయక చర్యల కోసం విరాళాలు అందజేయాలనిపిలుపునిచ్చింది.