Oct 05,2022 13:18

ప్రజాశక్తి-నార్పల : నార్పల మండల కేంద్రంలో విజయదశమి పండగ సందర్భంగా స్థానిక చౌడమ్మ దేవాలయం నందు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు అనంతపురం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నార్పల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణంతోనే సాధ్యమవుతుందన్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం మేమందరం కూడా ఆయన బాటలో నడుస్తామని తెలియజేశారు. అదేవిధంగా వీకేంద్రీకరణ వలన రాయలసీమలో హైకోర్టు విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరియు విజయవాడలో రాజధాని రావాలని విజయదశమి పండుగ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో వికేంద్రీకరణ జరగాలని కోరుకుంటున్నాము అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ మండల అధ్యక్షులు నాగేశ్వరావు సర్పంచ్ మనీల సుప్రియ ఉప సర్పంచ్ గవ్వల శ్రీరాములు ఎంపీటీసీ సభ్యులు వార్డు మెంబర్లు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.