
ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డికి ఎట్టకేలకు డిక్లరేషన్ ఫారాన్ని రిటరిుంగు అధికారి, అనంతపురం జిల్లా కలెక్టరు ఎస్ నాగలక్ష్మి ఆదివారం అందజేశారు. శనివారం రాత్రి 8 గంటల సమయంలోనే కౌంటింగ్ పూర్తయింది. కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయంటూ వైసిపి అభ్యర్థి వెనుపూస రవీంద్రారెడ్డి ఆరోపించడమే కాకుండా రీకౌంటింగ్ జరపాలనిడిమాండ్ చేశారు. కొంతసేపు కౌంటింగ్ కేంద్రంలో నిరసన తెలిపారు. ఎనిుకల ప్రధానాధికారికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే ఎనిుకల ఫలితాలను కలెక్టరు ఎస్ నాగలక్ష్మి ప్రకటించారు. కానీ, ఎన్నికైన అభ్యర్థికి డిక్లరేషన్ ఫారం ఇవ్వలేదు. దీంతో, డిక్లరేషన్ ఇవ్వాలంటూ టిడిపి నాయకులు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి తదితరులు శనివారం రాత్రి ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించి అనంతరం విడుదల చేశారు. ఎట్టకేలకు కలెక్టరు నాగలక్ష్మి ఆదివారం ఉదయం 9.30 గంటలకు తన ఛాంబరులో రాంగోపాల్‌రెడ్డికి డిక్లరేషన్ ఫారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన ఎనిుకల అధికారి నుంచి అనుమతులు రావడం ఆలస్యమైనందునే డిక్లరేషన్ అందజేయడంతో జాప్యమైందని తెలిపారు.