Oct 02,2022 15:48

ప్రజాశక్తి-పాలకొల్లు :  శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాలకొల్లు వాసవి కళ్యాణమండపంలో ధనలక్ష్మీ అలంకరణ చేసారు. కోటి 11లక్షల11 వేల 116 రూపాయిలతో అలంకరణ చేసారు. మామిడి తోరణాల వలె వివిధ రూపాయిల నోట్లతో అలంకరణ చేయడంతో ప్రజలు నోట్ల అలంకరణ చూడటానికి పోటీ పడుతున్నారు. కరోనా తరువాత 2 సంవత్సరాలు అలంకరణలు లేకపోవడంతో ప్రస్తుతం అలంకరణలు చూడటానికి ప్రజలు బాగా వస్తున్నారు.