
ప్రజాశక్తి- : ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నల్లమోతు మధుబాబుపై చర్యలు తీసుకోవాలని ఏపీ అనుచరులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం బూడిద లారీలను అడ్డుకుని వసంత కృష్ణ ప్రసాదు బావమరిది తరలిస్తున్నాడంటూ ఎమ్మెల్యేని అసభ్య పదజాలంతో మధుబాబు దూషించారు. వీడియో వైరల్ అవుతుండడంతో వసంత కృష్ణ ప్రసాదు అభిమానులు ఆగ్రహానికి గురైయ్యారు. నల్లమోతు మధుపై పలు సెక్షన్ల కింద ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.