
- ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం అధ్యక్షులు గంగాలకుంట నరేష్ కుమార్ రెడ్డి..
ప్రజాశక్తి-ఆత్మకూరు : మాజీ రాష్ట్రపతి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నాయకులు గురువారం నాడు అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు గంగాలకుంట నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భారత రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి పనిచేశారు అలాంటి మహానుభావుడు అనంతపురం జిల్లాలో పుట్టడం అనంతపురం జిల్లా వాసులుగా మనందరం చేసుకున్న అదృష్టం. ఆయన ఆలోచన విధానంతో రాష్ట్రంలో దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి వాటి ద్వారా పేదల బ్రతుకులు మారాయి. నీలం సంజీవరెడ్డి లాంటి గొప్ప మహానుభావుడి ఆశయాలను కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గౌరవించాలని అదేవిధంగా అనంతపురం నగరంలో నూతనంగా ఏర్పాటుచేసిన బ్రిడ్జికి నీలం సంజీవరెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులను కోరుతున్నాము. గతంలో ఆ బ్రిడ్జికి నీలం సంజీవరెడ్డి పేరు ఉంది ఇప్పుడు కూడా అదే పేరుని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గట్టి రెడ్డి భయపరెడ్డి జిల్లా అధ్యక్షులు రేనాటి నాగేశ్వర రెడ్డి, రైతు విభాగం ఉపాధ్యక్షులు సూర్యచంద్రారెడ్డి, యువజన విభాగం నాయకులు ఆదికేశవరెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.