Mar 02,2021 20:30

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : ధానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెనుప్రమాదం తప్పింది. సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరిన రైలు జనగామ జిల్లా ఘన్‌పూర్‌ స్టేషన్‌ సమీపంలో లూప్‌లైన్‌ నుంచి మెయిన్‌లైన్‌కు మారుతున్న క్రమంలో బోగీల నుంచి ఇంజన్‌ విడిపోయింది. బోగీలు స్టేషన్‌ ఘన్‌పూర్‌ రైల్వే గేటు వద్ద ఆగిపోయాయి. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు ఇంజన్‌ను వెనక్కి రప్పించి బోగీలకు తగిలించారు. అరగంట తర్వాత రైలు కాజీపేట మీదుగా ధానాపూర్‌కు బయలుదేరి వెళ్లింది. వేగం తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పిందని ప్రయాణికులు భావిస్తున్నారు.