Feb 06,2023 21:30

ఆర్‌డిఒ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న టిడిపి శ్రేణులు

పాలకొండ: రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని టిడిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ అన్నారు. సోమవారం స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి జాప్యం లేకుండా తక్షణమే రైతులకు సొమ్ము చెల్లించాలని, ధాన్యం కొనుగోలు గడువు మార్చి నెలాఖరుకు పెంచాలని, రైతులకు నేటి వరకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని కోరారు. అనంతరం వినతిపత్రాన్ని సబ్‌కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌కు అందించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు గండి రామినాయుడు, చేబోదుల లక్ష్మీనారాయణ, శాసపు సుగుణాకర్‌, జాడ శ్రీధర్‌, పి.గౌరునాయుడు, కోట సంగంనాయుడు, సిరిపురపు జగదీష్‌, కరణం వరహాలనాయుడు తదితరులు పాల్గొన్నారు.