Oct 17,2020 22:20

ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాట్స్‌మెన్‌ శిఖర్‌ ధావన్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. శామ్‌ కరన్‌ వేసిన రెండో ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన శిఖర్‌ ధావన్‌ చాహర్‌ వేసిన మూడో ఓవర్‌లో మరో ఫోర్‌ కొట్టాడు. తాకూర్‌ వేసిన ఆరో ఓవర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ సిక్స్‌, ధావన్‌ ఫోర్‌ బాదడంతో ఆ ఓవర్‌లో మొత్తం 12 పరుగులు రాబట్టారు. జడేజా వేసిన ఏడో ఓవర్‌లో ధావన్‌ రెండు ఫోర్లతో చెలరేగిపోయాడు. కరన్‌ శర్మ వేసిన తొమ్మిదో ఓవర్‌లో ధావన్‌ రెండు ఫోర్లు బాదాడు. డ్వేన్‌ బ్రావో వేసిన పదో ఓవర్‌లో శిఖర్‌ దావన్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.