Nov 26,2021 11:48

న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, పంటకు కనీస మద్దతు కోరుతూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో చేపడుతున్న రైతాంగ ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తైంది. దీంతో ఢిల్లీ-సింఘు, ట్రికి, ఘాజిపూర్‌ సరిహద్దులతో పాటు దేశ వ్యాప్తంగా వారికోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వేలాది మంది రైతులు చేరకుంటున్నారు. దీంతో దేశ రాజధానిలోని వివిధ పాయింట్ల వద్ద ఢిల్లీ పోలీసులు భద్రతను పెంచారు. గత వారం ఈ నూతన చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించినప్పటికీ... అవి రాజ్యాంగ ప్రక్రియ ముగిసేంత వరకు అదేవిధంగా.. తమ మిగిలిన డిమాండ్లను నెరవేర్చేంత వరకు ఇళ్లకు వెళ్లే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెప్పారు.