Jul 29,2021 22:21

వినతిని అందజేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీలు కేతిరెడ్డి, గోరంట్ల మాధవ్‌

        ధర్మవరం టౌన్‌ : జాతీయ రహదారులను కలుపుతూ ధర్మవరానికి బైపాస్‌ రోడ్డు కేటాయించాలని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విన్నవించారు, ఢిల్లీలో గురువారం హిందూపురం పార్లమెంట్‌ ఎంపీ గోరంట్ల మాధవ్‌తో కలిసి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కేంద్ర మంత్రిని కలిసి వినతి అందజేశారు. జాతీయ రహదారులు ఎన్‌ హెచ్‌ 544డి, ఎన్‌ హెచ్‌ 42, ఎన్‌ హెచ్‌ 44 లను కలుపుతూ ధర్మవరానికి బైపాస్‌ రోడ్డు ను కేటాయించాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.