Jun 13,2022 17:23

ప్రజాశక్తి-బనగానపల్లె రూరల్ : ఉదృత అతిసార నియంత్రణ పక్షోత్సవాల సందర్భంగా మండలంలోని టంగుటూరు పిహెచ్సి పరిధిలో అతిసార నియంత్రణ గురించి అవగాహన కార్యక్రమాలు సోమవారం నిర్వహించసారు. ఈ సందర్బంగా డాక్టర్ శివశంకరుడు మాట్లాడుచూ 5 సం,,లోపు పిల్లలు కలుషిత ఆహాహారం, కలుషితనీరూ సేవించడం వల్ల అతిసారకు గురై మరణాలు సంభవిస్తున్నాయని దీని నివారణకు ORS ద్రావణం, జింక్ మాత్రలు వాడితే తగ్గిపోతాయని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని, తాజా ఆహారం రక్షిత మంచినీరు సేవిస్తే అతిసార రాకుండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా మూతలు పెట్టుకోవాలన్నారు. ఇంటి పరిసరాల పరిధిలో నీటి కుంటలు ఉండకుండా మురికి కాలువలు శుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. మురికి ఉన్నచోట బీజింగ్ పౌడర్ చల్లాలని లేదా వేస్ట్ ఆయిల్ చల్లా అన్నారు. ఈ కార్యక్రమములో సూపర్ వైసర్లు, ఏఎన్ఎం, ఆశాలు పాల్గొన్నారు.