అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Feb 13,2024 00:24

ప్రజాశక్తి-గుంటూరు, పెదనందిపాడు : అంగన్‌వాడీలు ఇటీవల చేసిన 42వ రోజులపాటు చేసిన సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించిన జిఒలు తక్షణమే విడుదల చేయాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా కార్యదర్శి పి.దీప్తి మనోజ, సిఐటియు జిల్లా కార్యదర్శి బి.ముత్యాలరావు కోరారు. ఈ మేరకు సోమవారం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఉమాదేవికి, సిడిపిఒ టి.కృష్ణవేణిని కలిసి వినతిపత్రాలు అందజేశారు. ముఖ్యంగా సమ్మెకాలం వేతనాలు, తదితర హామీల అమలుకు సంబంధించిన జిఒలు తక్షణమే విడుదల చేయాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో టి.రాధ, కె.చిన్నవెంకాయమ్మ, ఎస్‌.కె.బాజిద్బీ ఉన్నారు. మండల కేంద్రమైన కాకుమానులో తహశీల్దార్‌కు అంగన్వాడీ యూనియన్‌, సిఐటియు నాయకులు వినతిపత్రం ఇచ్చారు. కె.శ్రీనివాసరావు, జి.ప్రేమలత, కె.ఝాన్సీ రాణి, టి.సువార్త, జె.లక్ష్మి కుమారి పాల్గొన్నారు.

➡️