అంగన్‌వాడీల పోరాటం స్ఫూర్తిదాయకం

ప్రజాశక్తి -కనిగిరి : రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ సమస్యలపై పోరాటం చేసిన ఘనత అంగన్‌వాడీలకు దక్కిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్‌ , సిఐటియు జిల్లా నాయకులు జి.శ్రీనివాసులు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిసి.కేశవరావు, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు కల్పన తెలిపారు. స్థానిక సుందరయ్య భవనంలో కుమారి అధ్యక్షతన అంగన్‌వాడీలకు జిల్లా స్థాయి శిక్షణ తరగతులు రెండో రోజూ ఆదివారమూ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మొండిగా ఉద్యమాన్ని నీరుగారి చేలా వ్యవహరించినా అంగన్‌వాడీలు పట్టించు కోకుండా తమ పోరాట పటిమను చాటి ప్రభుత్వం దిగివచ్చేలా పోరాడారన్నారు. సమస్యలు ఏవైనా పోరాటాల ద్వారానే సాధించుకోవచ్చని నిరూపించారన్నారు. అంగన్‌వాడీల పోరాటం స్ఫూర్తిదాయమని తెలిపారు. ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అందుకు సహకారం అందిస్తుందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాయళ్ల మాలకొండయ్య, రంగారావు, మహాలక్ష్మి, రాధా, సీత,రజిని, రామ సుబ్బులు , ఎల్లమ్మ, మహిళా సంఘం నాయకులు ప్రసన్న, బషీరా తదిదిరులు పాల్గొన్నారు.

➡️