అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలి

ప్రజాశక్తి – రాయచోటి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దష్టి సారించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళ వారం రాయచోటి కలెక్టరేట్‌లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్‌సి బి. కృష్ణారావు, డిఆర్‌ఒ సత్యనారాయణరావు హాజర య్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ పోలీస్‌, రెవెన్యూ, ప్రాసిక్యూషన్‌ విభాగాలు సమన్వ యంతో పనిచేసి ఎస్‌సి, ఎస్‌టి వర్గాలపై నమోదు అయిన కేసుల్లో జాప్యాన్ని నివారించి సత్వర న్యాయం అందించాలన్నారు. జిల్లాలో ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసుల పరిష్కా రంలో భాగంగా సంఘటనలు జరిగిన వెంటనే పోలీసులు విశ్వక్షబంధంగా విచారణ చేసి కేసులు నమోదు చేయా లన్నారు. ఎఫ్‌ఐఆర్‌ కాగానే బాధితులకు పరిహారం అందజేసేలా సంబంధిత అధికా రులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎస్‌సి, ఎస్‌టిలకు ఎక్కడ అన్యాయం జరిగినా అధికారుల దష్టికి తీసుకురావాలని డివిఎంసి కమిటీ సభ్యులకు సూచించారు. 2023 నవంబరు 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు జిల్లాలో మొత్తంగా 15 ఎస్‌సి, ఎస్‌టి కేసులు నమోదై విచారణ దశలో ఉన్నా యని వాటిని త్వరగా పరిష్క రించాలని సూచించారు. బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా చొరవ తీసుకో వాలన్నారు. కేసులలో ఎప్పటి కప్పుడు ఛార్జిషీట్‌ దాఖలు చేయ డంతో పాటు నిర్ణీత సమ యంలోగా కేసులను పూర్తిచేయాలని అన్నారు. బాధి తులకు ప్రభుత్వం తరపున ఆర్ధిక సాయం సకాలంలో అందేలా చూడాల న్నారు. మండల, డివిజన్‌ స్థాయిలో ప్రతినెలా క్రమం తప్పకుండా సివిల్‌ రైట్స్‌ డే నిర్వహి ంచాలని, కేసులకు సంబంధించి కుల దవీకరణ పత్రాలను సంబంధిత తహశీల్దార్లు వెంటనే జారీ చేయాలని, దీన్ని పర్యవేక్షించాలని ఆర్‌ డిఒలకు సూచించారు. స్పీడ్‌ కేసులలో త్వరితగతిన జడ్జిమెంట్‌ వచ్చేలా పోలీస్‌, న్యాయ శాఖ పిపిలు కషి చేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఎస్‌పి బి. కృష్ణారావు మాట్లాడుతూ జిల్లాలో నమోదైన అట్రా సిటీ కేసులకు సంబంధించి ఎలాంటి పక్షపాతం, జాప్యం లేకుండా విచారణ చేస్తుందని తెలిపారు. ఇప్పటికే అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ సందర్భంగా కేసులకు సంబంధించిన ఎలాంటి సమాచారం తమ దష్టికి తీసుకురావాలని సభ్యులను కోరారు. జిల్లాలో నమోదైన ఎస్‌సి, ఎస్‌టి కేసుల ప్రగతి, ఆయా అంశా లలో తీసు కున్న చర్యలపై డివిఎంసి సభ్యులు అడిగిన సందే హాలకు కలెక్టర్‌, ఎస్‌పి సందేహలు నివత్తి చేశారు. ఈ సంద ర్భంగా రాయచోటిలో అంబేద్కర్‌ భవన్‌ ఏర్పాటు చేయాలని, జిల్లాలో అన్ని మండలాలలో ఎస్‌సి, ఎస్‌టి శ్మశాన వాటికలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కమిటీ సభ్యులు కలెక్టరుకు విన్నవించారు. ఈ అంశాలను ప్రత్యేక దష్టితో సానుకూలంగా పరిష్క రించేందుకు కషి చేస్తామని కలెక్టర్‌ కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. సమీక్షలో రాజంపేట ఆర్‌డిఒ మోహన్‌రావు, డిఎస్‌పిలు మహబూబ్‌బాషా, కేశప్ప, విఎన్‌కె చైతన్య, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి జాకీర్‌ హుస్సన్‌, బిసి సంక్షేమ శాఖ అధికారి సందప్ప, న్యాయశాఖ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, జిల్లా నిఘా పర్యవేక్షక కమిటీ సభ్యులు హాజరయ్యారు.

➡️