అన్నమ్మకు ఘన నివాళి

Apr 3,2024 01:54 #ఘన నివాళి

ప్రజాశక్తి-సంతనూతలపాడు: సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు మాతృమూర్తి రిటైర్డ్‌ టీచర్‌ తలతోటి అన్నమ్మ వారి స్వగ్రామం గుంటూరు జిల్లా తూబాడు గ్రామంలోని వారి స్వగృహంలో సోమవారం సాయంత్రం మరణించారు. ఆమె మరణించిన విషయం తెలుసుకున్న పలువురు ఆమె పార్థివదేహాన్ని మంగళవారం సందర్శించి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. నివాళు లర్పించినవారిలో సంతనూతలపాడు మండల వైసీపీ అధ్యక్షులు దుంపా చెంచిరెడ్డి, జెసిఎస్‌ కన్వీనర్‌ దుంపా యలమందారెడ్డి, జెడ్పిటిసి దుంపా రమణమ్మ, ఎంపీపీ బి విజయ, ఏఎంసీ ఛైర్మన్‌ మారెళ్ల బంగారుబాబు, ఎన్‌జి పాడు మండల వైసీపీ అధ్యక్షుడు పోలవరపు శ్రీమన్నారాయణ, పంచాయతీరాజ్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు నర్రా సురేష్‌, గృహ నిర్మాణ సంస్థ రాష్ట్ర డైరెక్టర్‌ కొలకలూరి విజరుకుమార్‌ చౌటపాలెం సర్పంచ్‌ కాట్రగడ్డ శ్రీనివాసరావు తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

➡️