అపోలో యూనివర్సిటీ ఫ్రెషర్స్‌ డే సెలబ్రేషన్‌

Feb 10,2024 22:09

అపోలో యూనివర్సిటీ ఫ్రెషర్స్‌ డే సెలబ్రేషన్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: స్థానిక మురకంబట్టు అపోలో యూనివర్సిటీలో శనివారం ఫ్రెషర్స్‌ డే నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ హెచ్‌.వినోద్‌భట్‌ మాట్లాడుతూ ప్రతాప్‌రెడ్డి ఆశయాన్ని ముందుకు తీసుకోవాలన్నారు. ఇవాళ అపోలో ఆరోగ్య రంగం, విద్యారంగంలో తన వంతు సేవలను దేశానికి, ప్రపంచానికి అందిస్తుందని వివరించారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఐఐటి, ఐసర్‌ వంటి సంస్థలతో ఎంఓయు కుదుర్చుకున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా నత్య ప్రదర్శనలు, సాంస్కతిక కార్యక్రమాలు వీక్షకులను కట్టిపడేశాయి. బిటెక్‌, అలైడ్‌ హెల్త్‌సైన్స్‌, హెల్త్‌ సైన్సెస్‌, మేనేజ్‌మెంట్‌తో సహా వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించారు.

➡️