అప్రెంటీస్‌ జీవో ప్రతుల కాపీలు దగ్ధం

Feb 12,2024 21:09

 ప్రజాశక్తి – వీరఘట్టం  : స్థానిక ఎమ్మార్సీ వద్ద సోమ వారం యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో డీఎస్సీ జీవో కాపీలను దగ్ధం చేశారు. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా అప్రెంటీస్‌ విధానం రద్దయిందని, దీన్ని సిఎ జగన్మోహన్‌ రెడ్డి డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి మరలా అప్రెంటిస్‌ విధానాన్ని అమలులోకి తీసుకురావడాన్ని నిరసిస్తూ జీవో కాపీలను దగ్ధం చేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.దుర్గాప్రసాద్‌, కె.దుర్గారావు, సభ్యులు వి.అన్నాజీరావు, సింహాచలం, టి.వెంకటరమణ, బాబ్జీ, రాజేష్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️