అప్రెంటీస్‌ విధానాన్ని రద్దు చేయాలి : యుటిఎఫ్‌

Feb 12,2024 20:06

ప్రజాశక్తి-బొబ్బిలి : ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ప్రభుత్వం అమలు చేయనున్న అప్రెంటీస్‌ విధానాన్ని రద్దు చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.విజయగౌరి డిమాండ్‌ చేశారు. అప్రంటీస్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సోమవారం సాయంత్రం గాంధీ బొమ్మ వద్ద జీవో ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ డిఎస్‌సి నోటిఫికేషన్‌లో అప్రెంటీస్‌ విధానాన్ని అమలు చేస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు. తక్షణమే అప్రంటీస్‌ విధానాన్ని రద్దు చేసి మెగా డిఎస్‌సి విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు ప్రసన్నకుమార్‌, రామకృష్ణ, వరప్రసాద్‌, కృష్ణదాసు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️