అభివృద్ధిని చూసి ఓటేయండి

Apr 1,2024 21:27

ప్రజాశక్తి -విజయనగరం టౌన్‌ : రానున్న ఎన్నికల్లో అభివృద్ధిని చూసి ఓటేయాలని ఎంపి అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌, విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. అభివృద్ధి చెందలేదని భావిస్తే తమకు ఓటు వేయవద్దని అన్నారు. ఇంటింటి ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ప్రశాంతి నగర్‌ ప్రాంతం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వము అందించిన సంక్షేమ పథకాలు, వివరించారు. ఈ సందర్భంగా ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ అన్ని ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంచ, ప్రజల కనీస అవసరాలను తీర్చడం బాధ్యతగా తీసుకున్నామన్నారు. అందువల్లనే నగరం అన్ని రంగాలలో అభివద్ధి చెందిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజలను మభ్య పెట్టే విధంగా ప్రతిపక్షం లేనిపోని అవాస్తవాలను మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో మేయర్‌ విజయలక్ష్మి, రాష్ట్ర పరిశ్రమల అభివద్ధి మండలి డైరెక్టర్‌ బంగారు నాయుడు, జోనల్‌ ఇన్చార్జిలు వెంపడాంలో బడ్డుకొండ ప్రచారం పూసపాటిరేగ : మండలంలోని వెంపడాం, తాళ్లపేట గ్రామాల్లో సోమవారం నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్ధి బడ్డుకొండ అప్పలనాయుడు ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు అందించే ఈ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. మరోసారి నెల్లిమర్ల వైసిపి ఎమ్మెల్యేగా తనను, విజయనగరం ఎంపిగా బెల్లాన చంద్రశేఖర్‌ని ఆశీర్వదించాలన్నారు. ఎంపిపి మహంతి కళ్యాణి, వైస్‌ ఎంపిపిలు రమేష్‌, ఎన్‌. సత్యనారాయణరాజు, మండల పార్టీ అధ్యక్షలు పతివాడ అప్పలనాయడు, నాయకులు మహంతి శ్రీనివాసరావు పిన్నింటి వెంకటరమణ, యల్లంనాయుడు, సర్పంచ్‌ పిన్నింటి కుమార్‌, జనార్దనరావు, పుప్పాల లక్ష్మినారాయణ, యడ్ల రామకృష్ణ, దేశెట్టి గణేష్‌, శాంతాటి శ్రీనువాసరావు, పల్లా సత్యం తదితరులు పాల్గొన్నారు.

➡️