అభివృద్ధిపై మంత్రి బొత్స సమీక్ష

Feb 10,2024 21:14

ప్రజాశక్తి-చీపురుపల్లి :  చీపురుపల్లి పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ సమీక్షించారు. వివిధ శాఖల అధికారులు, మండల అధికారులు, పంచాయతీ సిబ్బందితో స్థానికంగా ఒక ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌ లో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామంలో పది రోజులపాటు ప్రత్యేక పారిశుధ్య పనులను నిర్వహించాలని, కాలువల్లో పూడికను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. గ్రామ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయవలసిన, మర్మతులకు గురైన విద్యుత్‌ లైట్లు, రోడ్లు, తాగునీరు, కాలువలు తదితర అభివద్ధి కార్యక్రమాలపై సర్వే నిర్వహించి మూడు రోజుల్లో తనకు నివేదిక అందజేయాలని వార్డు కార్యదర్శులను మంత్రి ఆదేశించారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా, గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని తనకు నివేదించాలని మంత్రి స్పష్టం చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద ఇప్పటికే సుమారు కోటి రూపాయలతో పనులను మంజూరు చేసామని, అవసరమైతే మరో కోటి రూపాయలకు పైగా మంజూరు చేసి పనులు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ పనులను ఇఒపిఆర్‌డి, ఎంపిడిఒలు స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపి బెల్లానచంద్రశేఖర్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌ , జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌ రాజా, జెడ్‌పిటిసి వలిరెడ్డి శిరీష, ఎంపిపి ఇప్పిలి వెంకట నరసమ్మ, సర్పంచ్‌ ఎం.సుధారాణి, ఎంపిటిసి పతివాడ రాజారావు, ఎంపిడిఒ డి.శ్వేత, తహశీల్దారు ఎన్‌ ప్రసాదరావు, ఇఒపిఆర్‌డి అన్నపూర్ణాదేవి, ఇతర అధికారులు, సచివాలయ సిబ్బంది, వలిరెడ్డి శ్రీనివాసరావు, ఇప్పిలి అనంత్‌ తదితరులు పాల్గొన్నారు.

మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచేందుకే పథకాలు

మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచేందుకు అన్నింటా సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అందిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మండలంలోని రావివలసలో జరిగిన గ్రామ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న అవినీతి కూడా లేకుండా పారదర్శకంగా అర్హులైన ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత వైసిపి ప్రభుత్వానిదని అన్నారు. పథకాల కోసం ప్రజలెవ్వరూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా నేరుగా ఆయా గ్రామాలలోనే సచివాలయాల ద్వారా సేవలను అందిస్తున్నామని మంత్రి అన్నారు. గ్రామానికి స్మశానానికి రోడ్డు, కాలువలను ఉపాధిహామీలో మంజూరు చేసి పనులు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అంతకు ముందు నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలక్టర్‌ త్రివినాగ్‌, జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, ఎంపిపి ఇప్పిలి వెంకట నర్శమ్మ, జెడ్‌పిటిసి వలిరెడ్డి శిరీష, సర్పంచ్‌ పనస మణికంఠ, ఎంపిటిసి కొమ్ము పద్మజ, రామలింగాపురం పిఎసిఎస్‌ పర్సన్‌ ఇన్చార్జి పనస అప్పారావు, తహశీల్దారు ఎన్‌.ప్రసాద రావు, ఎంపిడిఒ డి.శ్వేత, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికే సచివాలయాలు

గుర్ల : మండలంలోని తెట్టంగిలో సచివాలయ భవనాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం సచివాలయాలను నిర్మించిందని అన్నారు. ప్రజలకు అసరమైన అన్ని పనులూ పరిష్కారమవుతున్నాయని తెలిపారు. అవినీతి లేకుండా సంక్షేమ పతకాలు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని అన్నారు. ఎంపిపి పొట్నూరు ప్రమీల, జెడ్‌పిటిసి శీర అప్పలనాయుడు, సర్పంచ్‌ జమ్ముపార్వతి, మండల పార్టీ అధ్యక్షులు స్వామినామయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️