అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా : దాసిరిపల్లి

ప్రజాశక్తి-పెద్దమండ్యం ఒక అవకాశం ఇచ్చి తంబళ్లపల్లి ఎమ్మెల్యే గా గెలిపిస్తే నియోజక వర్గాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా, అన్నిరంగంలో అభివద్ధి చూపిస్తానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాసిరిపల్లి జయచంద్రారెడ్డి పేర్కొ న్నారు. మంగళవారం ఆయన పెద్దమండ్యం పంచాయతీలో విస్తతంగా పర్య టించి ఇంటింటికి కరపత్రాలను అందించారు. అనంతరం జయహో బిసి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజక వర్గాన్ని పారిశ్రామికంగా ఏర్పాటు చేసి, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తారని, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కాలువ ద్వారా చెరువులకు, కుంటలకు నీరు వచ్చే ఏర్పాటు చేస్తామని అన్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో 1300 కోట్లు రోడ్లకు ఖర్చు పెట్టి వేచిన అధికార పార్టీ నాయకుల స్వలాభం కోసం చూసుకున్నారని ఆరోపించారు. టిడిపి అధికారంలోకి యాభై సంవత్సరాలు నిండిన అర్హులైన బిసిలందరికీ పింఛన్‌ను అందిస్తామని చెప్పారు. చంద్రన్న బీమా ద్వారా పది లక్షలు వర్తిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రచార కార్యదర్శి పర్వీన్‌తాజ్‌ మాటా ్లడుతూ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత బిసిలకు తీవ్ర అన్యాయం జరిగిందని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిసి పథకాలన్నీ అమలు చేయలేదని అన్నారు. కార్యక్రమంలో తంబళ్లపల్లి జనసేన అధ్యక్షుడు సాయినాథ్‌, బిసిసెల్‌ నాయకులు త్యాగరాజు, బిసి సెల్‌ ఉపాధ్యక్షులు తులసిధర్‌నాయుడు, ఉమ్మడి అభ్యర్థి జేజేంద్రారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజంపేట బిసి సెల్‌ అధ్యక్షులు సురేందర్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

➡️