ఆకట్టుకున్న రాష్ట్రస్థాయి సైన్స్‌ కళాజాతా

Feb 13,2024 22:00
ఫొటో : గీతాలాపన చేస్తున్న కళాకారులు

ఫొటో : గీతాలాపన చేస్తున్న కళాకారులు
ఆకట్టుకున్న రాష్ట్రస్థాయి సైన్స్‌ కళాజాతా
ప్రజాశక్తి-కావలి : జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయిలో ఫిబ్రవరి 5వ తేదీన శ్రీకాకుళంలో బయల్దేరిన సైన్స్‌ కళాజాతా మంగళవారం కావలికి చేరుకొని, కళాకారులు ప్రదర్శించిన సైన్స్‌ నృత్య రూపకాలు, నాటికలు, మ్యాజిక్‌, గీతాలాపనలు చూపరులను విశేషంగా ఆకట్టుకుని, అలరించాయి. కావలి, బాపూజీ నగర్‌లోని విశ్వశాంతి ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల ఆవరణంకు చేరుకొని గొప్ప సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరై, మూఢ నమ్మకాలతో మాయమాటలతో జనాన్ని మోసం చేసే దొంగ బాబాలు చేసే పనులు, మంత్ర తంత్రాలను నమ్మక శాస్త్తీయ దృక్పథం పెంచేందుకనేందుకు ఈ కళాజాతా ఎంతో ఉపయోగకరం అని జెవివి కావలి పట్టణ శాఖ గౌరవాధ్యక్షులు డాక్టర్‌ బి.రవికుమార్‌, కార్యదర్శి గాదిరెడ్డి హరనాథ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, సహాయ కార్యదర్శి పి.జానకిరామ్‌ పేర్కొన్నారు. ఈ కళాజాతాను జెవివి రాష్ట్ర కార్యదర్శి మురళీధర్‌ నడిపించగా, కళాజాతా మేనేజర్‌ త్రిమూర్తులు ఇతర కళాకారులు నిర్వహించారు. నృత్యాలు , బృంద గానాలు, రూపకాలు, నాటికలు, మేజిక్‌ ప్రదర్శన విజయవంతంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో విశ్వశాంతి కరస్పాండెంట్‌ దేవిరెడ్డి వెంకట రమణయ్య, జెవివి ఉపాధ్యక్షురాలు సి శారద, జి.కల్యాణి, కె.జాన్‌, కోశాధికారి టి.సుబ్బరామ శర్మ, గాయకులు ఎస్‌.రమణయ్య పాల్గొన్నారు.

➡️