‘ఆడుదాం ఆంధ్ర’ విజేతలకు బహుమతి ప్రదానం

వినుకొండ: పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో  నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర పల్నాడు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలో విజేతలుగా నిలిచిన క్రీడా కారులకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు శనివారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత ఆటల్లో రాణించే విధంగా ప్రభుత్వం తరపున ఇలాంటి పోటీలు క్రీడాకారుల్లో నైపు ణ్యాన్ని వెలికితీసేందుకు దోహద పడతాయన్నారు. ఆటల వలన శరీర వ్యాయామం కలిగి అరోగ్యం మెరుగుపడేందుకు దోహదపడుతుందని తెలిపారు. మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసి క్రీడల్లో ప్రపంచ స్థాయి కి ఎదిగేందుకు వీలు కలుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే తో పాటు సంబంధిత శాఖ అది కారులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

➡️