ఆరోగ్య సురక్షను వినియోగించుకోవాలి

Feb 13,2024 20:49

ప్రజాశక్తి- నెల్లిమర్ల : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బి. భాస్కర రావు అన్నారు. మంగళ వారం పెద బూరాడ పేటలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. శిబిరంలో 383 మంది రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బెల్లాన అప్పయ్యమ్మ, తుమ్మల పేట పిఎసిఎస్‌ అద్యక్షులు కోట్ల పైడి నాయుడు, నాయకులు బెల్లాన రామారావు, ఎంపిడిఒ జి.రామారావు, కొండ వెలగాడ పిహెచ్‌సి వైద్యులు వై.ధనుంజరు, పివి శిరీష, ఎంపి హెచ్‌ ఓ జి. అప్పలనాయుడు పాల్గొన్నారు.డెంకాడ: మండలంలోని అమకాం గ్రామంలో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శబిరాన్ని నిర్వహించారు. ఉప సర్పంచ్‌ దిండి కోటి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో ఇద్దరు స్పెషలిస్టు వైద్యులు చానుఖ్య, శ్రీనువాస్‌, మోపాడ వైద్యాధికారి పివివి యోగితాబాల 279 మంది రోగులకు వైద్య సేవలు అందించారు. ఇందులో 20 మందికి కంటి పరీక్షలను పిఎంఒ మజ్జి గణపతిరావు చేశారు. అనంతరం అవసర మైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, మోపాడ పిహెచ్‌సి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.వేపాడ: మండలంలోని సోంపురంలో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని సర్పంచ్‌ మురిపిండి గంగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. వైద్యాధికారులు డాక్టర్‌ పి.శివాని, డాక్టర్‌ బి. శ్రీసత్య శ్రీనివాస్‌, డాక్టర్‌ బి. మౌనిక వైద్య సేవలు అందించారు. అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో బొద్దాం పిహెచ్‌సి వైద్య సిబ్బంది, గ్రామ సచివాలయ ఏఎన్‌ఎం, ఆశ వర్కర్‌, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️