ఆల్బెండజోల్‌ అందరికీ సురక్షితం

Feb 9,2024 21:39

 ప్రజాశక్తి – పార్వతీపురంటౌన్‌  : ఆల్బెండజోల్‌ మాత్రలు పిల్లలకు, పెద్దలకు సురక్షితమైనవి అని, వీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తువని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో స్థానిక డివివిఎం ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. అల్బెండజోల్‌ టాబ్లెట్లను వేసుకుని నులు పురుగులను నివారించుకుని ఆరోగ్యవంతంగా పిల్లలంతా ఉండాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ పి.సింహాచలం, డిఇఒ జి.పగడాలమ్మ, డిఐపిఆర్‌ఒ ఎల్‌.రమేష్‌, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ దవళ భాస్కరరావు, డాక్టర్‌ శ్రీధర్‌, ప్రధానోపాధ్యాయులు బి.గోవిందు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సాలూరు: పట్టణంలోని నాలుగో వార్డు అంగన్వాడీ కేంద్ర లో ఐసిడిఎస్‌ సిడిపిఒ బి.సత్యవతి డి-వార్మింగ్‌ డే సందర్భంగా పిల్లలకు మందు పంపిణీ చేశారు. అనంతరం తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. నులిపురుగుల వల్ల రక్తహీనత ఏర్పడుతుందని, దీని నివారణకు ఈ మందు బాగా పనిచేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎఎన్‌ఎం జయలక్ష్మి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని శ్రీ వెంకట విద్యాగిరి పాఠశాల లో విద్యార్థులకు కరస్పాండెంట్‌ డాక్టర్‌ కోడూరు సాయి శ్రీనివాసరావు విద్యార్థులకు నులిపురుగుల మందు పంపిణీ చేశారు. పిల్లల నోట్లో చుక్కలు వేశారు. పొట్టలో నులిపురుగుల నివారణ వల్ల రక్తహీనత తగ్గుతుందని చెప్పారు. కావున ఈ మాత్రలను పిల్లలంతా వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ ఎం లక్ష్మీ ఉపాద్యాయులు పాల్గొన్నారు.

సీతానగరం : జాతీయ నులిపురుగు దినోత్సవ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా లక్షా 75 వేల 891 మంది పిల్లలకు నిలుపురుగు మందులు వేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.జగన్నాథం తెలిపారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన మాట్లాడుతూ 1773 ప్రభుత్వ పాఠశాలలు ఒకటి సున్నా మూడు ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగు మాత్రలు వేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారి పి.పావని. సూపర్వైజర్‌ ఉన్నారు.

కురుపాం : జాతీయ నులిపురుగుల దినోత్సవ సందర్భంగా మండలంలోని రావాడ రామభద్రపురం పిహెచ్‌సి వైద్యాధికారి సిహెచ్‌ శంకరరావు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే బాలుర రెసిడెన్షియల్‌ పాఠశాలలో విద్యార్థులకు ఎంపిపి శెట్టి పద్మావతి ఆల్జెండ్‌జోల్‌ మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ గార్ల సుజాత, ఉపసర్పంచ్‌ షేక్‌ ఆదిల్‌,గుజ్జువాయి సర్పంచ్‌ హెచ్‌ నాగేశ్వరరావు, పంచాయతీ సెక్రెటరీ చంటి, సచివాలయం సెక్రటరీ ఎ. గున్నారావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

పాలకొండ : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎస్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆల్బెండా జోల్‌ మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ పైలా శంకర్రావు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి వెలమల అప్పారావు, ఆంగ్ల అధ్యాపకులు నారాయణరావు, తెలుగు అధ్యాపకులు బివిటి శ్రీనివాసరావు, పాల్గొన్నారు. సుమారు 450మంది విద్యార్థులకు ఆశా కార్యకర్తలు మహేశ్వరి, కన్యాకుమారి, ఆదిలక్ష్మి మాత్రలు పంపిణీ చేశారు.

గరుగుబిల్లి: స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు అల్జెండ్‌జోల్‌ మాత్రలను కొమ రాడ ఐసిడిఎస్‌ సూపర్వైజర్‌ రౌతు లక్ష్మీ పంపిణీ చేశారు.కార్యక్రమంలో ఎఎన్‌ఎం బి.శ్రీదేవి అంగన్వాడీ వర్కర్లు పల్లా కృష్ణవేణి, రౌతు పద్మ, మూడడ్ల స్వాతి, తదితరులు పాల్గొన్నారు.

భామిని : జాతీయ నులిపురుగులు దినోత్సవం దినోత్సవం సందర్బంగా భామిని, బత్తిలి, బాలేరు పిహెచ్‌ సి పరిధిలో గల అంగన్వాడీ కేంద్రాల్లో ఆయా పాఠశాలల వైద్యాధికారులు దీపికారాణి, పసుపులేటి సోయల్‌, కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆల్బెండ్‌జోలు మాత్రలు పంపిణీ చేశారు. భామిని పిహెచ్‌సి పరిధిలో 4264 మంది విద్యార్థులకు, బాలేరు పిహెచ్‌సి పరిధిలో 2394 మంది విద్యార్థులకు ఈ మాత్రలను పంపిణీ చేశామన్నారు. ఇంకా ఎవరైనా విద్యార్థులు వివిధ కారణాలతో తప్పిపోతే ఈనెల 16న మ్యాప్‌ అప్‌ కార్యక్రమం ద్వారా ఆల్బండ్‌ జోల్‌ మాత్రలు పంపిణీ చేస్తామని వైద్యులు తెలిపారు.

వీరఘట్టం : ప్రతి విద్యార్థి తప్పనిసరిగా నులిపురుగు మందు వేసుకోవాలని ఎంఇఒ- 2 ఆర్‌ .ఆనందరావు విద్యార్థులకు సూచించారు. మండలంలోని కిమ్మి ఎంపియుపి పాఠశాలలో డి వార్మింగ్‌ డే సందర్భంగా విద్యార్థులకు నులిపురుగు మందులు మింగించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం.పారినాయుడు, బోనంగి వాసుదేవరావు, ఎఎన్‌ఎం రాజేశ్వరి, విద్యార్థులు పాల్గొన్నారు.

బలిజిపేట : అజ్జాడలో డీవార్మింగ్‌, జెఏఎస్‌ కార్యక్రమాలను జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి. జగన్‌ మోహనరావు తనిఖీ చేశారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బండజోల్‌ మాత్రలు వేయడాన్ని ఆయన పరిశీలించారు. ఒక పూర్తి మాత్రను మధ్యాహ్నం భోజనం తర్వాత విద్యార్థులందరూ మాత్రలు నమిలి తీసుకునేలా పర్యవేక్షణ చేశారు.

➡️