ఆశ వర్కర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం

Feb 10,2024 21:34

ప్రజాశక్తి- శృంగవరపుకోట : ఆశ వర్కర్లపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోందని సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలోని శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దిల రమణ మాట్లాడుతూ రోజు రోజుకీ మార్కెట్‌లో ధరలు విపరీతంగా పెరుగుతున్నా యన్నారు. వీటికి అనుగుణంగా ఆశా వర్కర్లకు కనీసవేతనం రూ.26వేలు ఇవ్వాలని, ఒకే యాప్‌లో పనులు చేపట్టాలని, అర్హత కలిగిన ఆశా వర్కర్లను సెకండ్‌ ఏఎన్‌ఎంలుగా తీసుకోవాలని, ఏఎన్‌ఎంల నియామకానికి జరిగే ఎగ్జాముల్లో ఆశా వర్కర్లకు వెయిటేజ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వారి డిమాండ్ల పరిష్కారానికి సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుని చ్చిందని, ఓపక్క యూనియన్‌ ప్రతినిధులతో చర్చిలకు పిలిచి తిరిగివస్తున్న యూనియన్‌ ప్రతిని ధులను ఆశావర్కర్ల నాయకులను పోలీసులతో అరెస్టు చేయించిందని, దీనికి నిరసనగా 9,10 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సిఐటి యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం నిరసన కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సిహె చ్‌ ముత్యాలు, ఆశా వర్కర్లు యూనియన్‌ నాయకులు బి విమల, రమణమ్మ, కే రాజేశ్వరి, ఆర్‌ శ్రావణి, ఎల్‌ యోగిని, కె.లక్ష్మి, ఎస్‌.కన్నమ్మ, టి.లక్ష్మి పాల్గొన్నారు.

➡️