ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాం

Feb 12,2024 21:40
ఫొటో : మాట్లాడుతున్న కళాశాల డీన్‌ డాక్టర్‌ టి.గోపికృష్ణ

ఫొటో : మాట్లాడుతున్న కళాశాల డీన్‌ డాక్టర్‌ టి.గోపికృష్ణ
ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాం
ప్రజాశక్తి-ఉదయగిరి : స్థానిక మేకపాటి గౌతమ్‌రెడ్డి వ్యవసాయ కళాశాలలో ఆహార తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నామని కళాశాల డీన్‌ డాక్టర్‌ టి.గోపికృష్ణ పేర్కొన్నారు. సోమవారం కళాశాలలో ఆయన ఛాంబర్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళాశాల హాస్టల్లో బాలురకు బాలికలకు ఒకే వంటగదిలో భోజనాన్ని తయారు చేస్తున్నామని తెలిపారు. గతంలో కొంతమంది విద్యార్థినులు బయటి ఆహారం తీసుకుని అనారోగ్యానికి గురైంది వాస్తవమేనన్నారు. ఇంజనీర్‌ కళాశాలను వ్యవసాయ కళాశాలగా మార్చిన వెంటనే మూడు ఆరో ప్లాంట్లుతో స్వచ్ఛమైన మంచినీటి వసతి కల్పించామన్నారు. కొందరు కళాశాలపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వాటిని విద్యార్థి తల్లిదండ్రులు నమ్మవద్దని ముఖ్యంగా ప్రజలను కోరారు.

➡️