ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు బిఎస్‌ఎన్‌ఎల్‌తో సీతం ఒప్పందం

Feb 11,2024 20:08

 ప్రజాశక్తి-విజయనగరం  : సత్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ లో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చెయ్యడానికి బిఎస్‌ఎన్‌ఎల్‌ తో అవగాహన ఒప్పందం (ఎంఒయు) కుదిరిందని కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.శశిభూషణరావు, పిన్సిపల్‌ డాక్టర్‌ డివి రామ మూర్తి తెలిపారు. ఈ ఒప్పంద పత్రాలపై వీరితో పాటు బిఎస్‌ఎన్‌ఎల్‌ డిజిఎం డాక్టర్‌ మల్ల సత్య ప్రసాద్‌ సంతకం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఇసిఇ, సిఎస్‌ఇ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇఇఇ విద్యార్థులు సాంకేతికతలపై పరిశోధనలు చేసుకునే సౌలభ్యం లభిస్తుందని కళాశాల డైరెక్టర్‌ శశిభూషణరావు తెలిపారు. కార్యక్రమంలో సీతం ఇసిఇ విభాగాధిపతి డాక్టర్‌ టిడివిఎ నాయుడు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️