ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలి

ప్రజాశక్తి- సిఎస్‌ పురంరూరల్‌ : దేశం అభివద్ధి చెందాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌.నారాయణ తెలిపారు. సిపిఐ కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చి పదేళ్లు దాటినా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు . ప్రభుత్వ ఆస్తులను అంబానీ, ఆదానీలకు కట్టబెడుతున్నట్లు విమర్శించారు. విజరు మాల్యా, నీరవ్‌ మోడీ లాంటి బడా బాబులకు రుణమాఫీ చేసి దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. దేశ ప్రజలు మేధావులు ఆలోచించి మతాలపేరుతో ప్రజల ను మోసం చేస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని గద ే్దదింపాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు వై.రవీంద్రబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ మౌలాలి, కనిగిరి నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్‌ యాసిన్‌, ఎఐటియుసి కనిగిరి నియోజకవర్గ కార్యదర్శి పి.మస్తాన్‌ రావు, కనిగిరి నియోజకవర్గం సహాయ కార్యదర్శి వి.సుబ్బారావు, కనిగిరి మండల కార్యదర్శి జిపి.రామారావు, పామూరు మండల కార్యదర్శి పోతల ప్రభాకర్‌, సిఎస్‌పురం మండల ప్రధాన కార్యదర్శి పేద మస్తాన్‌, సహాయకార్యదర్శి జి. నరసింహులు, చెంచయ్య, యేసు, అంకమ్మ,పోలమ్మ, ఆదిలక్ష్మమ్మ పాల్గొన్నారు.

➡️