ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దాలి

Feb 21,2024 20:59

ప్రజాశక్తి – భోగాపురం : ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్‌ మోడల్‌ స్కూల్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఎమ్‌. వెంకట కృష్ణారెడ్డి అన్నారు. స్థానిక మోడల్‌ స్కూల్లో జోన్‌ -1,2 పరిధిలోని మోడల్‌ స్కూల్స్‌ ప్రిన్సిపాల్స్‌, వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులతో బుధవారం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్‌, పదో తరగతి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచాలన్నారు. విద్యార్థులు పరీక్షలపై దృష్టి పెట్టే విధంగా వారిని తీర్చిదిద్దాలన్నారు. ప్రత్యేక తరగతులతో పాటు పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇలా చేయడం వల్ల విద్యార్థుల మధ్య పోటీ తత్వం పెరుగుతుందన్నారు. విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకుండా ఇష్టపడి చదివేలా వారికి నిరంతరం కౌన్సిలింగ్‌ నిర్వహిస్తుండాలన్నారు..పరీక్షలు దగ్గర పడుతున్నందున ఫలితాల కోసం నిబద్ధతతో పనిచేయాలని కోరారు. సమావేశంలో ఆర్జేడి జ్యోతి కుమారి, సీబీఎస్‌ఈ రాష్ట్ర కోఆర్డినేటర్‌ సి.శ్రీలత, ఎఎంఒ ఎం.శరత్‌బాబు, ఎంఇఒలు రమణమూర్తి, చంద్రమౌళి, ప్రిన్సిపాల్‌ పార్వతి పాల్గొన్నారు.

➡️