ఉత్సాహంగా షటిల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

Feb 11,2024 20:05

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం జిల్లా స్థాయి మాస్టర్స్‌ షటిల్‌ బాడ్మింటన్‌ టోర్నమెంట్‌ , ఎంపిక పోటీల ను జిల్లా బాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ 35ఏళ్ల వయసు నుండి 75ఏళ్ల వయసు గల పురుషులకు , మహిళలకు 9 కేటగిరీలలో జిల్లా స్థాయి వెటరన్‌ షటిల్‌ బాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలలో విజయనగరం జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు, ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు ప్రసంశాపత్రాలు అందజేసి, మార్చిలో 3 రోజులపాటు రాజమండ్రిలో జరగబోయే రాష్ట్రస్థాయి వెటరన్‌ షటిల్‌ బాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో, అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు ఎమ్‌కెబి శ్రీను, కార్యదర్శి వై.కె.బచ్చన్‌, సహాయ కార్యదర్శి నున్న సురేష్‌, మీడియా ఇంఛార్జి ఎస్‌.మల్లిఖార్జునరావు, జిల్లా నలుమూలల నుండి వచ్చిన మాస్టర్స్‌ క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

➡️