ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమీక్ష

పల్నాడు జిల్లా: రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ ముఖేష్‌ కుమార్‌ మీనా ఎన్నికల నిర్వహణ సన్నద్ధత ఏర్పాట్లు, ఓటరు క్లైయిమ్‌ పరి ష్కారం అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో కలెక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరం నుంచి కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ పాల్గొన్నారు. సమావేశానికి ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ఆర్డీవోలు, తహశీల్దార్లు హాజరయ్యారు. వారి వారి నియోజకవర్గాల పరిధిలో చేపట్టిన ఎన్నికల ప్రక్రియ గురించి వివరించారు. నూతన యువ ఓటర్‌ లు కార్డులు, చనిపోయిన వారి ఓటర్ల వివరాలు, ఫామ్‌ 6, ఫామ్‌ 7,8 వివరాలు, తదితర ఓటర్ల వివరాలను ఎలక్షన్‌ సీఈవోకు తెలియ జేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, ఎఆర్‌ఒలు, ఏఈఆర్వోలు పాల్గొన్నారు.జిల్లా ఎన్నికల సమా చారాన్ని కలెక్టర్‌ అందించారు. నియోజకవర్గాల పరిధిలో చేపట్టిన ఎన్నికల ప్రక్రియ గురించి కలెక్టర్‌కు అధికారులు వివరించారు. నూతన యువ ఓటర్‌ లు కార్డులు, చని పోయిన వారి ఓటర్ల వివరాలు, ఫామ్‌ 6, ఫామ్‌ 7,8 వివరాలు, తదితర ఓటర్ల వివరాలను ఎలక్షన్‌ సీఈవోకు తెలియజేశారు.

➡️