ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఇసుక దందా

Feb 13,2024 21:49

ప్రజాశక్తి-పాలకొండ, కురుపాం, గరుగుబిల్లి : వైసిపికి చెందిన పాలకొండ, కురుపాం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ ఇసుక దందాలకు పాల్పడుతూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. టిడిపి అధికారంలోకి వస్తే ఏజెన్సీని ఏళ్లతరబడి పీడిస్తున్న ఏనుగుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గిరిజనులకు ఉపయోగపడే జీవో 3 అమలు చేస్తామని ప్రకటించారు. అవినీతి అధికారులు, వైసిపికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆగడాలు కట్టిస్తామని అన్నారు. పాలకొండ, కురుపాంలో ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు నిమ్మల జయకృష్ణ, తోయిక జగదీశ్వరి అధ్యక్షతన జరిగిన శంఖారావం సభల్లో నారా లోకేష్‌ మాట్లాడారు. జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదని అన్నారు. సంపూర్ణ మధ్య పాన నిషేధం అంటూ మాట తప్పిన ముఖ్య మంత్రి అని ఏద్దేవా చేశారు. 40ఏళ్లు దాటిన ఎస్‌టిలకు పింఛను ఇస్తానని చెప్పి మోసం చేశారన్నారు. జిల్లాలో సుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపిస్తానని చెప్పి మాట తప్పారన్నారు. బాంబులకే జడని కుటుంబం తమదని, జగన్‌పెట్టే కేసులకు భయపడేది లేదని అన్నారు. టిడిపి అధికారం లోకి వస్తే ఏనుగులు సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. ఎన్నో ఏళ్లగా గిరిజనుల కలగా ఉన్న పూర్ణ పాడు – లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని, గుమ్మిడి గెడ్డ ను నిర్మిస్తామని తెలిపారు. పార్టీ కోసం ఎక్కువ కష్టపడి కేసులు భరించిన వారిని గుర్తించి నామిటెడ్‌ పదవులు అందిస్తామన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయడానికి జగన్‌ రెడ్డే తెరలేపారని, ఎంతో ఉత్తరాంధ్రకు అవసరమైన ఉక్కుకర్మాగారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని తీసుకుని నడిపించి కార్మికులకు అండగా నిలుస్తుందని అన్నారు. ఐటిఐ కళాశాల, పొలిటెక్నికల్‌ కళాశాల, తోటపల్లి అధునీకరణ పనులు పూర్తి చేస్తామని, లిప్టు ఇరిగేష్‌ పనులకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. జగన్‌ పాలనలో తొమ్మిది సార్లు కరెంట్‌ బిల్లులు, మూడు సార్లు ఆర్టీసీ చార్జీలతోపాటు ఇంటి పన్నులు, చెత్త పన్నులు కూడా విపరీతంగా పెంచేశారన్నారు. చివరికి రానున్న రోజుల్లో గాలి పన్ను కూడా విధిస్తారని ఎద్దేవా చేశారు. విశాఖ పట్టణంలోని ప్రజాధనంతో రూ.500 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్‌ నిర్మాణం చేసుకున్నారని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాఅవసరా లకు వినియోగిస్తా మన్నారు. ఇంకా ఎన్నికలకు రెండు నెలలు మాత్రమే సమయం ఉందని, కార్యకర్తలంతా కష్టపడి జనసేన, టిడిపి మద్దతు తెలిపిన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి జగన్‌ రెడ్డి గద్దెదించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అవినీతిపరులు ఒకరిని గెలిపిస్తే..పాలకొండ నియోజకవర్గంలో ఇద్దరు ప్రజాప్రతినిధులు వచ్చి ప్రజల మీద పడి దోచుకుంటున్నారని నారా లోకేష్‌ ఆరోపించారు. ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ పట్టణంలోని డిగ్రీ కళాశాల దగ్గర విలువైన స్థలాన్ని కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇసుక దందాలు చేసుకుంటున్నారన్నారు. ఒకరు నాగావళి నది నుంచి ఇసుకను దోచుకోగా, మరొకరు వంశధార నది నుంచి ఇసుక దోపిడీ చేస్తున్నారన్నారు. రెండుసార్లు కళావతిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు ఆమె చేసినదేమీ లేదన్నారు. నియోజకవర్గ సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశారన్నారు.కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్‌రాజు, ఆమె బావ రమేష్‌ అడ్డంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇసుక దోపిడీతోపాటు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను అమ్ముకుంటున్నారని విమర్శించారు. పాలకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలో సమస్యలను పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. పాలకొండ వెనుకబాటుతనానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలే కారణమన్నారు. నియోజకవర్గంలో భూ కబ్జాలు, ఇసుక మాఫీయా వారి కన్నుసన్నల్లోనే సాగుతుందన్నారు. రెండేసి మండలాలను ఇద్దరు సర్దుకుని దోచుకుంటున్నారని ఆరోపించారు. స్థానిక నగర పంచాయతీలో కోట్లు విలువైన స్థలం ఎమ్మెల్సీ విక్రాంత్‌ కబ్జాలు చేయగా, ఎమ్మెల్యే కళావతి వండువలో 33 ఎకరాలు చెరువును కబ్జా చేశారన్నారు. గిరిజనులు అవసరమైన జీవో నెంబరు3ను పక్కా అమలు చేయాలని, నియోజకవర్గంలో ఐటీఐ, డిప్లమా కళాశాలు ఏర్పాటు చేయాలని, ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు పూర్తి చేయాలని నారా లోకేష్‌ను కోరారు. జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నిమ్మల ఇబ్రం మాట్లాడుతూ వైసిపి పాలనలో పని చేసే వారు తక్కువ అయ్యారని, దోచుకునే వారు ఎక్కువయ్యారని అన్నారు. అరుకు పార్లమెంటరీ ఇన్‌చార్జ్‌ కిడారి శ్రవణ్‌ కుమార్‌ మాట్లాడుతూ అరాచపాలన జరుగుతుందని, స్కామ్‌లు ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన జిల్లా అధ్యక్షులు పి.చంద్రమోహన్‌, టిడిపి, జనసేన పార్టీల నాయకులు పడాల భూదేవీ, గర్బాన సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.ముఖ్య నాయకులు ఎందుకు రాలేదో? శంఖారావం సభకు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళావెంకటరావు, పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు హాజరు కాకపోవడం పట్ల సర్వత్రా చర్చ జరిగింది. తొలి నుంచి పాలకొండ నియోకవర్గంలో ఒక గ్రూపు కళావెంకటరావు, మరో గ్రూపు అచ్చెన్నాయుడుతో ఉండడంతో గ్రూపుల పోరు సెగ వారికి తగలకుండా దూరంగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ప్రజాశక్తి-పాలకొండ, కురుపాం, గరుగుబిల్లి వైసిపికి చెందిన పాలకొండ, కురుపాం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ ఇసుక దందాలకు పాల్పడుతూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. టిడిపి అధికారంలోకి వస్తే ఏజెన్సీని ఏళ్లతరబడి పీడిస్తున్న ఏనుగుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గిరిజనులకు ఉపయోగపడే జీవో 3 అమలు చేస్తామని ప్రకటించారు. అవినీతి అధికారులు, వైసిపికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆగడాలు కట్టిస్తామని అన్నారు. పాలకొండ, కురుపాంలో ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు నిమ్మల జయకృష్ణ, తోయిక జగదీశ్వరి అధ్యక్షతన జరిగిన శంఖారావం సభల్లో నారా లోకేష్‌ మాట్లాడారు. జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదని అన్నారు. సంపూర్ణ మధ్య పాన నిషేధం అంటూ మాట తప్పిన ముఖ్య మంత్రి అని ఏద్దేవా చేశారు. 40ఏళ్లు దాటిన ఎస్‌టిలకు పింఛను ఇస్తానని చెప్పి మోసం చేశారన్నారు. జిల్లాలో సుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపిస్తానని చెప్పి మాట తప్పారన్నారు. బాంబులకే జడని కుటుంబం తమదని, జగన్‌పెట్టే కేసులకు భయపడేది లేదని అన్నారు. టిడిపి అధికారం లోకి వస్తే ఏనుగులు సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. ఎన్నో ఏళ్లగా గిరిజనుల కలగా ఉన్న పూర్ణ పాడు – లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని, గుమ్మిడి గెడ్డ ను నిర్మిస్తామని తెలిపారు. పార్టీ కోసం ఎక్కువ కష్టపడి కేసులు భరించిన వారిని గుర్తించి నామిటెడ్‌ పదవులు అందిస్తామన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయడానికి జగన్‌ రెడ్డే తెరలేపారని, ఎంతో ఉత్తరాంధ్రకు అవసరమైన ఉక్కుకర్మాగారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని తీసుకుని నడిపించి కార్మికులకు అండగా నిలుస్తుందని అన్నారు. ఐటిఐ కళాశాల, పొలిటెక్నికల్‌ కళాశాల, తోటపల్లి అధునీకరణ పనులు పూర్తి చేస్తామని, లిప్టు ఇరిగేష్‌ పనులకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. జగన్‌ పాలనలో తొమ్మిది సార్లు కరెంట్‌ బిల్లులు, మూడు సార్లు ఆర్టీసీ చార్జీలతోపాటు ఇంటి పన్నులు, చెత్త పన్నులు కూడా విపరీతంగా పెంచేశారన్నారు. చివరికి రానున్న రోజుల్లో గాలి పన్ను కూడా విధిస్తారని ఎద్దేవా చేశారు. విశాఖ పట్టణంలోని ప్రజాధనంతో రూ.500 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్‌ నిర్మాణం చేసుకున్నారని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాఅవసరా లకు వినియోగిస్తా మన్నారు. ఇంకా ఎన్నికలకు రెండు నెలలు మాత్రమే సమయం ఉందని, కార్యకర్తలంతా కష్టపడి జనసేన, టిడిపి మద్దతు తెలిపిన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి జగన్‌ రెడ్డి గద్దెదించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అవినీతిపరులు ఒకరిని గెలిపిస్తే..పాలకొండ నియోజకవర్గంలో ఇద్దరు ప్రజాప్రతినిధులు వచ్చి ప్రజల మీద పడి దోచుకుంటున్నారని నారా లోకేష్‌ ఆరోపించారు. ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ పట్టణంలోని డిగ్రీ కళాశాల దగ్గర విలువైన స్థలాన్ని కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇసుక దందాలు చేసుకుంటున్నారన్నారు. ఒకరు నాగావళి నది నుంచి ఇసుకను దోచుకోగా, మరొకరు వంశధార నది నుంచి ఇసుక దోపిడీ చేస్తున్నారన్నారు. రెండుసార్లు కళావతిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు ఆమె చేసినదేమీ లేదన్నారు. నియోజకవర్గ సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశారన్నారు.కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్‌రాజు, ఆమె బావ రమేష్‌ అడ్డంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇసుక దోపిడీతోపాటు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను అమ్ముకుంటున్నారని విమర్శించారు. పాలకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలో సమస్యలను పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. పాలకొండ వెనుకబాటుతనానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలే కారణమన్నారు. నియోజకవర్గంలో భూ కబ్జాలు, ఇసుక మాఫీయా వారి కన్నుసన్నల్లోనే సాగుతుందన్నారు. రెండేసి మండలాలను ఇద్దరు సర్దుకుని దోచుకుంటున్నారని ఆరోపించారు. స్థానిక నగర పంచాయతీలో కోట్లు విలువైన స్థలం ఎమ్మెల్సీ విక్రాంత్‌ కబ్జాలు చేయగా, ఎమ్మెల్యే కళావతి వండువలో 33 ఎకరాలు చెరువును కబ్జా చేశారన్నారు. గిరిజనులు అవసరమైన జీవో నెంబరు3ను పక్కా అమలు చేయాలని, నియోజకవర్గంలో ఐటీఐ, డిప్లమా కళాశాలు ఏర్పాటు చేయాలని, ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు పూర్తి చేయాలని నారా లోకేష్‌ను కోరారు. జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నిమ్మల ఇబ్రం మాట్లాడుతూ వైసిపి పాలనలో పని చేసే వారు తక్కువ అయ్యారని, దోచుకునే వారు ఎక్కువయ్యారని అన్నారు. అరుకు పార్లమెంటరీ ఇన్‌చార్జ్‌ కిడారి శ్రవణ్‌ కుమార్‌ మాట్లాడుతూ అరాచపాలన జరుగుతుందని, స్కామ్‌లు ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన జిల్లా అధ్యక్షులు పి.చంద్రమోహన్‌, టిడిపి, జనసేన పార్టీల నాయకులు పడాల భూదేవీ, గర్బాన సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.ముఖ్య నాయకులు ఎందుకు రాలేదో? శంఖారావం సభకు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళావెంకటరావు, పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు హాజరు కాకపోవడం పట్ల సర్వత్రా చర్చ జరిగింది. తొలి నుంచి పాలకొండ నియోకవర్గంలో ఒక గ్రూపు కళావెంకటరావు, మరో గ్రూపు అచ్చెన్నాయుడుతో ఉండడంతో గ్రూపుల పోరు సెగ వారికి తగలకుండా దూరంగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

➡️