ఎసిబి వలలో అసిస్టెంట్‌ ఇంజినీరు

Mar 1,2024 23:54

నగదుతో పట్టుబడిన ఎఇ శివరామకృష్ణ
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
ఒక కాంట్రాక్టర్‌ నుంచి భారీగా లంచం తీసుకుంటుండగా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఎసిబి అధికారులు దాడి చేసి అసిస్టెంట్‌ ఇంజినీరును అదుపులోకి తీసుకున్నారు. పెదకూరపాడు ప్రాంతానికి చెందిన రవికిషోర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్‌ వద్ద రూ.1,68,000 లంచం తీసుకుంటూ ఉండగా అసిస్టెంట్‌ ఇంజినీరు శివరామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారించారు. మొత్తం రూ.42 లక్షల పనులు చేయగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించేందుకు సంబంధిత బిల్లులకు ఎం.బుక్స్‌ సిద్ధం చేయడానికి ఏఈ శివరామకృష్ణ భారీ మొత్తంలో నగదు డిమాండ్‌ చేశారు. దీంతో రవికిషోర్‌రెడ్డి ఎసిబి అధికారులను ఆశ్రయించారు. ఎసిబి అధికారుల సూచనల మేరకు రవికిషోర్‌రెడ్డి నగదు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డిఎస్‌పి ప్రతాప్‌ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️