ఐదుగురు అంతర్‌ జిల్లా చోరులు అరెస్టు

Feb 10,2024 00:24

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : ద్విచక్ర వాహనాలను చోరీ కేసుల్లో ఐదుగురుర్ని నల్లపాడు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్దనుండి రూ.24 లక్షల వాహనాలను, మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను జిల్లా ఎస్‌పి తుషార్‌ దూడి శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వెల్లడించారు. నల్లపాడు, మేడికొండూరు, పట్టాభిపురం, మంగళగిరి టౌన్‌, తాడేపల్లి, అమరావతి, ఇబ్రహీంపట్నం, ఒంగోలు టౌన్‌, సూర్యారావుపేట, విజయవాడ గవర్నర్‌పేట పోలీసు స్టేషన్ల పరిధిలోని ద్విచక్ర వాహనాలు, మొబైల్‌ షాపుల్లో చోరీ కేసులలో గోరంట్లకు చెందిన షేక్‌ ఆసీఫ్‌, పొన్నూరు మండలం ఎరుకుపాలేనికి చెందిన జాష్టి వెంకటసాయి, ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన మైదకూరి హసీబ్‌, పొన్నూరు పట్టణం డివిసి కాలనీకి చెందిన దేవరకొండ రాజ్‌కుమార్‌, తాడికొండ మండలం రావెలకు చెందిన షేక్‌ మహమ్మద్‌ను అరెస్టు చేసినట్టు ఎస్‌పి చెప్పారు. 14 కేసుల్లో 13 ద్విచక్ర వాహనాలు, 30 సెల్‌ ఫోన్లు, ఐదు ఛార్జర్లు, 10 పవర్‌ బ్యాంకులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. కార్యక్రమంలో నల్లపాడు సిఐ సిహెచ్‌.రాంబాబు, ఎస్‌ఐ డి.అశోక్‌ పాల్గొన్నారు.

➡️