ఒపిఎస్‌ ఇచ్చేవారికే ఓటు : యుటిఎఫ్‌

ప్రజాశక్తి-పీలేరు ఉద్యోగ, ఉపాధ్యాయులుకు ఒపిఎస్‌ ఇచ్చే వారికే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేస్తామని యుటిఎఫ్‌ నాయకత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. మంగళవారం పీలేరులో యుటిఎఫ్‌ నాయకత్వం ఈ మేరకు గోడ పత్రికలు ఆవిష్కరించింది. తాను అధికారంలోకి వస్తే సిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ అమలు చేస్తానని ఇచ్చాపురం మొదలు కుప్పం వరకు తన పాదయాత్రలో, సమావేశాల్లో చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, చివరికి ఉద్యోగ, ఉపాధ్యాయులను వంచిస్తూ సిపిఎస్‌ స్థానంలో జిపిఎస్‌ తీసుకొస్తామంటూ ఏవేవో పనికిమాలినవ ప్రకటనలతో మోసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ ఒపిఎస్‌ అమలు చేస్తామని మేనిఫెస్టోలో చేర్చే పార్టీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తమకు జరిగిన అన్యాయాన్ని బహిరంగపరచడానికి యత్నించిన ఉద్యోగ, ఉపాధ్యాయుల ఉద్యమాలను రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాలతో అణిచివేయడానికి ప్రయత్నం చేసినా, ఏమాత్రం జంకాకుండా యుటిఎఫ్‌ నాయకత్వం ఎదిరించి పోరాడిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు సదాశివరెడ్డి, అన్నమయ్య జిల్లా నాయకులు శివారెడ్డి, అక్రంబాషా, చంద్రశేఖర్‌, రాధాకష్ణ, కష్ణమూర్తి, శెట్టి సుబ్రమణ్యం, మస్తాన్‌, వెంకటరమణ, సుధాకర్‌, వేణుగోపాల్‌, ముని రెడ్డి, పేరయ్య, వెంకటరమణారెడ్డి, పాల్గొన్నారు.

➡️