ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి

Feb 28,2024 21:08

ప్రజాశక్తి-కడప అర్బన్‌ జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహికులకు మరింత ప్రోత్సాహాన్ని అందించాలని కలెక్టర్‌ వి. విజరు రామరాజు డిఐఈపిసి సభ్యులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి మరింత విస్తత పరచాలన్నారు. జిల్లా ఆర్థిక ప్రగతికి ఆయువు పట్టు ఆయన పారిశ్రామిక రంగాన్ని మరింత అభివద్ధి పథంలోకి తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహకాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దష్టి సారిస్తోందన్నారు. అదే దిశగా జిల్లాలో కూడా పారిశ్రామిక రంగాన్ని మరింత పటిష్టం చేసి జిల్లా ఆర్థిక అభివద్ధికి దోహద పడాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి, ఔత్సహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందివ్వాలని పేర్కొన్నారు. కొత్తగా పారిశ్రామిక రంగంలోకి అడుగిడాలనుకున్న వారికి ఆర్థిక ప్రాత్సాహాన్ని అందించేలా బ్యాంకర్లు సహకరించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక నూతన పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రోత్సహిం చాలన్నారు. పరిశ్రమల ప్రమోషన్‌కు సంబందించి ఇంకా ఏవైనా అప్లికేషన్లు పెండింగ్‌లో ఉంటే వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయి నుండి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువతకు పారిశ్రామిక పెట్టుబడులు, యూనిట్ల స్థాపనపై విస్తతంగా అవగాహన పెంపొందించాలని పేర్కొన్నారు. పారిశ్రామిక అభివద్ధి పాలసీ (ఐడిపి) 2020-23 ప్రకారం వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసం ద్వారా ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 10 యూనిట్లకు గాను రూ.79.90 లక్షలు, వడ్డీ రాయితీకి సంబంధించి 3 యూనిట్లకు గాను రూ.8.20 లక్షల చొప్పున మొత్తం 13 యూనిట్లకు గాను రూ.88.1 లక్షల రాయితీ మొత్తం విడుదలకు కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ఈ మేరకు పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ జయలక్ష్మి సంబందిత వివరాలను సమావేశంలో కలెక్టర్‌కు వివరించగా ఆయా అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. సమావేశంలో డిప్యూటీ చీఫ్‌, ఇన్స్పెక్టర్‌ ఆఫ్‌ ఫాక్టరీస్‌ డిపార్ట్మెంట్‌ కృష్ణమూర్తి, జెడ్‌ఎం (టెక్నీకల్‌) శ్రీనివాస మూర్తి, ఐపఒ లీడ్‌ బ్యాంక్‌ చీఫ్‌ మేనేజర్‌ దుర్గాప్రసాద్‌, ఎపిఐఐసి ప్రతినిధులు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఇఇ, వాణిజ్య పన్నుల శాఖ, ఎపిఎస్‌ పిడిసిఎల్‌ , లేబర్‌ శాఖల అధికారులు, ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

➡️