కనీస వేతనం ఇవ్వాలని ఆశాలు నిరసన

Feb 10,2024 22:05

 ప్రజాశక్తి – సీతంపేట : కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని శనివారం ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎపి ఆశా, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్‌.లక్ష్మి మాట్లాడుతూ చలో విజయవాడకు ఆశా వర్కర్లు వెళ్తే తమ సమస్యలు, బాధలు చెప్పుకోవడానికి వెళ్తే వినకుండా ప్రభుత్వం పోలీసులచే తరిమివేశారన్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలన్నారు. ఒకేసారి వేతనం అందించాలన్నారు. సిహెచ్‌డబ్ల్యూఒలను ఆశాలుగా మార్చాలని డిమాండ్‌ చేశారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాన్ని ఇచ్చిన సంక్షేమ పథకాలన్ని అందించాలన్నారు. మెటర్నటీ లీవులు ఇవ్వాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉద్రిక్తత చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎపి ఆశా, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల సంఘం అధ్యక్షులు ఎస్‌.లక్ష్మి, కార్యదర్శి దీప, కమిటీ సభ్యులు విజయ, ఉష, విజయలక్ష్మి, శ్రీలత, హైమావతి, రాజేశ్వరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️