కళింగ సేవా సంఘం నూతన కార్యవర్గం

కళింగ సేవా సంఘం

ప్రజాశక్తి -మధురవాడ: కళింగ సేవా సంఘం అధ్యక్షులుగా శివశక్తి నగర్‌ ప్రాంతానికి చెందిన బగాది లక్ష్మణరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జివిఎంసి ఐదవ వార్డు చిలుకూరి లేఅవుట్‌లోని కళింగ సామాజిక భవనంలో విశ్రాంత ఎస్‌సి ప్రసాదరావు, అటవీ శాఖ అధికారి బిర్లంగి నరేష్‌ ఆధ్వర్యంలో మధురవాడ కళింగ సేవా సంఘం నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షులుగా బగాది లక్ష్మణరావు (బిఎల్‌ఆర్‌), గౌరవాధó్యక్షులుగా అయోధ్య నగర్‌కు చెందిన సిపాన వెంకటరమణ, కార్యదర్శిగా సాయిరాం కాలనీకి చెందిన గురుగువెళ్లి యోగేశ్వరరావు, కోశాధికారిగా బొడ్డేపల్లి రంగారావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు లక్ష్మణరావు మాట్లాడుతూ, సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సేవా కార్యక్రమాలకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. సంఘాన్ని బలోపేతం చేయడం ద్వారా సమిష్టిగా సమస్యలను పరిష్కరించుకుందామన్నారు.

ఎన్నికైన నూతన కమిటీ

➡️