కానిస్టేబుల్‌ బెదిరించి లైంగిక దాడి

Feb 13,2024 23:32

ప్రజాశక్తి – దాచేపల్లి : కానిస్టేబుల్‌ లైంగిక హింస వల్ల గర్భాన్ని కోల్పోయాను.. నా చిన్న పాపను గదిలో బంధించి ఆమెను చంపుతానే బెదిరిస్తూ నన్ను పలుమార్లు లైంగిక హింసలుకు గురిచేశాడు.. అతనిపై ఫిర్యాదు చేస్తుంటే ఏ ఒక్క పోలీస్‌ అధికారి కూడా స్పందించడం లేదు… అని దాచేపల్లికి చెందిన మహిళ వాపోయారు. ఓ కేసు విషయంలో తన భర్తను కాపాడతానంటూ కానిస్టేబుల్‌ వెంకట్‌ నాయక్‌ నమ్మించాడని, అది జరగాలంటే తన లైంగిక కోర్కెలు తీర్చాలని బెదిరించాడని చెప్పారు. అప్పుడు తాను మణ్ణెల్ల గర్భిణినని, తాను అంగీకరించకున్నా కానిస్టేబుల్‌ వెంకటనాయక్‌ లైంగిక దాడి చేయడంతో తాను గర్భాన్ని కోల్పోయానని బోరున విలపించారు. ఇంత జరిగినా తన భర్తను కాపాడలేదని, స్టేషన్‌లో ఉంచి కొట్టారని చెప్పారు. చిన్నపాప ఇంట్లో ఉన్నప్పుడు కూడా లైంగిక దాడి చేశాడని, పాపను గదిలో బంధించి లైంగికంగా తనకు లొంగకపోతే పాపను చంపుతానని బెదిరించి పలుమార్లు లైంగిక దాడి చేశాడని అన్నారు. ఇప్పుడు తననూ చంపుతానంటూ బెదిరిస్తున్నాడని,తీ హింసలను తట్టుకోలేని తాను జిల్లా దిశా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించగా వారు దాచేపల్లికి వెళ్లాలని చెప్పారని, అక్కడికి వెళ్లి సిఐను కలవగా ఎస్‌ఐను కలవాలన్నారని, ఎస్‌ఐను కలవగా డీఎస్పీని కలవాలన్నారని, ఇలా పలుమార్లు స్టేషన్‌ చుట్టూ తిప్పించుకుంటున్నారేగాని న్యాయం చేయడం లేదని ఆవేదనకు గురయ్యారు. తనను వేధించిన కానిస్టేబుల్‌కే పోలీసులు వత్తాసు పలుకుతున్నారని కన్నీరు పెట్టుకున్నారు.

➡️