కార్పొరేట్ల ప్రయోజనాలకే భూహక్కుల చట్టం

భూహక్కుల చట్టం

బార్‌ అసోసియేషన్‌, స్టీరింగ్‌ కమిటీ ప్రతినిధుల ధ్వజం

ప్రజాశక్తి- భీమునిపట్నం : కార్పొరేట్ల ప్రయోజనాలే లక్ష్యంగా ఎపి భూ హక్కుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని బార్‌ అసోసియేషన్‌, స్టీరింగ్‌ కమిటీ ప్రతినిధులు ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన చిట్టివలస బంతాట మైదానంలో ఎపి భూహక్కుల యాజమాన్యం చట్టం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ అవగాహన సదస్సు నిర్వహించారుఈ సందర్భంగా స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ ప్రముఖ న్యాయవాది బెవరా సత్యనారాయణ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఏకరూప భూహక్కుల చట్టం ఉండాలన్న నీతి ఆయోగ్‌ లక్ష్యం వెనుక కార్పొరేట్లు, పెత్తందారుల ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోపించారు. నీతిఅయోగ్‌ ఆదేశించడమే తడవుగా ఎపిలో ఆగమేఘాల మీద అమలుకు ఉపక్రమించడం దుర్మార్గమన్నారు. బార్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, రైతులు, పేదల ఆస్తి హక్కులకు తీవ్ర విఘాతం కలిగించే ఎపి ల్యాండ్‌ టైటి లింగ్‌ యాక్ట్‌,2023 రద్దుకు పోరాడాలని, దానికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సభకు అధ్యక్షత వహించిన స్థానిక బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎన్‌.జనార్ధనరావు మాట్లాడుతూ, దోపిడిపూరిత చట్టం నుంచిశాశ్వత విముక్తి కోసం ప్రజలంతా సంఘటితమై పోరాడాలని పిలుపునిచ్చారుసదస్సులో స్టీరింగ్‌ కమిటీ ప్రతినిధులు వేణుగోపాలరావు, పి.గిరిధర్‌, భీమిలి బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి నమ్మి సూరిబాబు, కోశాధికారి ఎం.సునీల్‌, జాయింట్‌ సెక్రటరీ బి.సూర్యప్రకాశరెడ్డి, న్యాయవాదులు టి.శ్రీనివాసరావు, ఎస్‌ వాయునందన, ఎస్‌ శ్యామ్‌కుమార్‌, పి బాలభాస్కరరావు పాల్గొన్నారు.ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్డు రద్దు చేయాలిపద్మనాభం : ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేయాలని విశాఖపట్నం బార్‌ అసోసియేషన్‌, స్టీరింగ్‌ కమిటీ సంయుక్త ఆధ్వర్యాన పద్మనాభం జంక్షన్‌లో శుక్రవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటికే ప్రభుత్వ భూములను ఆస్తులను భవనాలను తాకట్టు పెట్టేసిన ప్రభుత్వం, ఈ చట్టం పేరుతో భూమి ఆస్తుల పత్రాలను ప్రపంచ బ్యాంకు చేతుల్లో పెట్టి అప్పులు తెచ్చుకునే ఎత్తుగడలో ఉందన్నారు. సివిల్‌ కేసులు, భూవివాదాలన్నీ ప్రభుత్వ అధీనంలోని ట్రిబ్యునల్‌ పరిధిలోకి వెళితే, రైతులు, ప్రజలు ఇబ్బందులు పడక తప్పదన్నారు. ఈచట్టంతో సిఆర్‌టిసి సెక్షన్‌ 41ఏను ప్రజలపై బలవంతంగా రుద్ది, పోలీస్‌స్టేషన్లకు విస్తృత అధికారాలు ఇవ్వడం ద్వారా సివిల్‌ వ్యవహారాలు, భూవివాదాల్లో ప్రభుత్వ అధికారులు, రాజకీయ ప్రతినిధులు జోక్యం పెరిగిపోవడం ఖాయమన్నారు. ఈ చట్టంతో వచ్చే ముప్పుపై అవగాహన కలిగి, సమిష్టిగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

సదస్సులో మాట్లాడుతున్న స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ సత్యనారాయణ

➡️