కావలి కాలువకు సాగునీరు విడుదల చేయాలి

Feb 13,2024 21:49
ఫొటో : రైతుసంఘాల తెలియజేస్తున్న సమస్యను వింటున్న ఆర్‌డిఒ శీనానాయక్‌

ఫొటో : రైతుసంఘాల తెలియజేస్తున్న సమస్యను వింటున్న ఆర్‌డిఒ శీనానాయక్‌
కావలి కాలువకు సాగునీరు విడుదల చేయాలి
– ఆర్‌డిఒకు రైతు సంఘాల నాయకుల వినతి
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : సోమశిల అధికారులు, కావలి ఎంఎల్‌ఎ, తదితర అధికారులు కావలి కాలువకు సాగునీరు ఇప్పుడు విడుదల చేసే పద్ధతులతో అయితే కావలి, బోగోలు, జలదంకి, మండలాల చివరి గ్రామాల చెరువుల కింద నిలువు మీద ఉన్న పైర్లు ఎండిపోతాయి కనుక సంఘం బ్యారేజీ దగ్గర 800 క్యూసెక్కులు కనీసం కావలి కాలువకు విడుదల చేయాలని రైతు సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఆర్‌డిఒకు ఎపి రైతుసంఘం, వ్యకాసం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నక్రాక బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్నారు. కావలి కాలువ చివరి వరకు ఉన్న చెరువుల కింద నిలువ మీద ఉన్న పైర్లను తక్షణమే కాపాడాలన్నారు. రెవెన్యూ, సోమశిల, ఎలక్ట్రికల్‌, పోలీస్‌ అధికారుల సమన్యాయంతో కావలి కాలువ చివరి చెరువులకు నీరు అందించాలని, నిలువు మీద ఉన్న వరి పైరును కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. లేకపోతే రైతుల ఆగ్రహానికి గురవుతారని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో రైతుసంఘం, వ్యకాసం నాయకులు టి.మాల్యాద్రి, రావి మాల్యాద్రి, వేముల సీతారామయ్య, గడ్డం మాల్యాద్రి, కె జాన్‌, తదితర నాయకులు పాల్గొన్నారు.

➡️