కిక్‌ బాక్సింగ్‌లో విద్యార్థులకు పతకాలు

Feb 13,2024 20:48

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : స్థానిక తోటపాలెంలోని సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో పవర్‌ కిక్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ కోచ్‌ సంతోష్‌ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల్లో పలువురు ఇటీవల పార్వతీపురంలో జరిగిన రాష్ట్ర అమెచ్యూర్‌ కిక్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలలో పతకాలు సాధించారు. ఐదుగురు విద్యార్థులు బంగారు పతకాలు, ముగ్గురు రజిత పతకాలు పొందారు. ఈ పోటీలను పార్వతీపురం కిక్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌, మినిస్ట్రీ ఆఫ్‌ యూత్‌ అఫైర్స్‌ స్పోర్ట్స్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌, స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా నిర్వహించారు. బంగారు పతకాలు సాధించిన వారిలో యు.దుర్గారవి, ఎ. చంద్ర మౌళి, ఆర్‌. వంశీవరుణ్‌, పి.భార్గవ్‌, ఎన్‌.మధు, రజిత పతకాలు సాధించిన వారిలో పి.హేమంత్‌, కె.శివగణేష్‌, వై.భూలోక్‌ ఉన్నారు. కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో కళాశాల సంచాలకులు డాక్టర్‌ ఎం శశి భూషణ రావు, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం వి సాయి దేవ మణి, కళాశాల ఎన్‌ సి సి ఆఫీసరు ఎం. ఉదరు కిరణ్‌ అభినందించారు. కరాటే సాధనతో మనోధైర్యం : ఎంఇఒలక్కవరపుకోట: కరాటే సాధనతో ప్రతి ఒక్కరిలోను మనోధైర్యం పెంపొందుతుందని ఎంఇఒ సిహెచ్‌ కూర్మారావు అన్నారు. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలో ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీలో మండలంలోని స్వామి వివేకానంద ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల నుండి 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని షేక్‌ తనీషా 12సంవత్సరాల కేటగిరిలో 35 కేజీల (మహిళలు) విభాగంలో పాల్గొని కుమ్మిటి ( ఫైటింగ్‌ )లో బంగారు పతకం సాధించింది. కాటాస్‌లో రజిత పతకంతో పాటు బెస్ట్‌ డిఫెండర్‌గా ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి పాఠకులకు విధితమే. ఈ సందర్భంగా ఆ పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన అభినంద సభ నిర్వహించి పాఠశాల కరస్పాండెంట్‌ బెహరా పురుషోత్తమరావు, ఏఎస్‌ఐ గోవిందరావు, శ్రీనివాసరావులతో ఎంఇఒ కలిసి తనీషాను ఘనంగా సన్మానించారు. కరాటే కోచ్‌ రాజు మాస్టర్‌ను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో విక్టరీ షుటోకాన్‌ కరాటే అసోసియేషన్‌ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి (హైదరాబాద్‌) కె ప్రసాదగౌడ్‌, ఆ పాఠశాలల హెడ్‌ మాస్టర్‌ ప్రసాద్‌, మాధవి, చదరం స్వాతి, ఛాయాదేవి, ఝాన్సీ, అధ్యాయపక బృందం, విద్యార్థులు, తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.

➡️